కరోనా, లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

కరోనా, లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

కరోనా వైరస్ నిర్మూలనలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి.. కఠినంగా అమలు చేస్తోంది... ఇక, తాజాగా కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, ఫార్మసీల వంటి వాటికి కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా గుమ్మిగూడే ప్రాంతాల్లో ఇవి అమలు చేయాలని ఆదేశించింది. కరోనా నిర్మూలనకు విధిగా ఈ ఆదేశాలను అమలు చేయాలని పేర్కొంది.

ఇక, ఏపీ సర్కార్ తాజా సూచనలు పరిశీలిస్తే.. 
* స్టోర్‌లో పనిచేసేవారికి కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వారు వెళ్లకూడదు.
* స్టోర్‌లలో రద్దీని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి.
* సరుకులు 2 వారాలకు మించి వినియోగదారులు కొనకుండా చర్యలు తీసుకోవాలి.
* వినియోగదారులు కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి.
* క్యూలైన్లలో 2 మీటర్లు లేదా 6 అడుగుల దూరం ఉండేలా గుర్తులు వేయాలి.
* పార్కింగ్ ప్లేస్ ఉంటే కస్టమర్ల ఫోన్ నంబర్ల ద్వారా ఎస్‌ఎమ్‌ఎస్ టోకెన్ విధానాన్ని అమలు చేయాలి.
* ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ప్రాధాన్యాత ఇచ్చి, డోర్ డెలివరీ చేయాలి.
* పనిచేసేవారికి ఎప్పటికప్పడు బాడీ టెంపరేచర్ చెక్ చేయాలి.
* స్టోర్‌లలో ఇన్‌, ఔట్ దగ్గర హ్యాండ్ శానిటైజర్‌ను ఏర్పాటు చేయాలి.
* వినియోగదారులు అన్ని వస్తువులను తాకకుండా చూడాలి.
* క్యాష్ కౌంటర్లలో ఉండేవారు విధిగా మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలి.
* ఆన్‌లైన్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
* కస్టమర్ల నుంచి క్యాష్ తీసుకోవాల్సి వస్తే వలలు వాడాలి.