కరోనా కల్లోలం : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా కల్లోలం :  ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో కోవిడ్‌–19 నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో ఎల్లుండి (బుధవారం) నుంచి ఆంక్షలు మొదలు కానున్నాయి. బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు కానుంది.  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్ని షాపులు ఓపెన్ ఉంటాయని.. ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే నడువనున్నాయి. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలు ఉండనున్నాయి.  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.  ఆ సమయంలో 144వ సెక్షన్‌ అమలులో ఉండనుంది. కాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు 20 వేలకుపైగా నమోదవుతున్నాయి.  ఏపీలో తాజాగా 23,920 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,45,022 కేసులు నమోదయ్యాయి.  ఇందులో 9,93,708 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,43,178 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.