కరోనా కట్టడికి జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా కట్టడికి జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో  ఏపీలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది జగన్ సర్కార్. ఐదుగురు మంత్రులతో  మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా ఉప సంఘం ఏర్పాటు చేసింది సర్కార్. హోంమంత్రి మేకతోటి సుచరిత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు  మెంబర్లుగా ఉప సంఘం ఏర్పాటు అయింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ అదిత్యనాథ్ దాస్. కరోనా కట్టడికి పలువురు కీలక అధికారులతో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కావలిసిన సలహాలు, సూచనలు చేయనుంది మంత్రి వర్గ ఉప సంఘం.