రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల..

రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల..

వర్షాలతో పంటదెబ్బతిని ఇబ్బందుల్లో పడిపోయిన రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... భారీ వర్షాలతో దెబ్బ తిన్న పంటలకు రూ. 10.76 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశారు.. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న పంటలకు గానూ ఈ ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో నష్టపోయిన రైతులకు ఈ ఇన్ పుట్ సబ్సిడీని అందజేయనున్నారు అధికారులు.. కాగా, 7,757 హెక్టార్లల్లో పంట నష్టానికి ఈ ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేశారు.. 17,872 మంది నష్టపోయిన రైతులకు రూ. 10.76 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ అందచేయనున్నారు.. 33 శాతానికంటే ఎక్కువగా నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసింది సర్కార్.