ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు గంటలే !

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు గంటలే !

కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు వినియోగానికి  అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అమ్మకాలపై కూడా నిషేధాజ్ఞల జారీ చేసింది సర్కార్. కాలుష్య రహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. అంతే కాక దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడోద్దని కూడా సూచించింది.