కాలేజీలకి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

కాలేజీలకి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఏపీ ప్రభుత్వం సంక్షేమ పధకాల విషయంలో చాలా సీరియస్ గా ఉంది. అర్హులు అయిన అందరికీ ఫలాలు అందించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ క్రమంలో ఏపీలోని అన్ని కాలేజ్ లకి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జగనన్న విద్యా దీవెనకు అర్హులైన విద్యార్దుల తల్లిదండ్రులపై ఒత్తిడి పెట్టొద్దంటూ కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లించాలంటూ కాలేజీలు ఒత్తిడి తేవద్దని ప్రభుత్వం ఆదేశించింది. జగనన్న విద్యా దీవెన స్కీములో భాగంగా విద్యార్దుల తల్లుల ఖాతాల్లో నాలుగు విడతలుగా నిధులు జమ చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. నిధుల విడుదల చేసిన వారం రోజుల్లోగా తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజు చెల్లిస్తారని స్పష్టం చేసింది. అంతే కాక సరైన కారణం లేకుండా ఫీజు చెల్లించకున్నా.. స్కీమ్ ద్వారా పొందిన డబ్బును దుర్వినియోగం చేసినా ప్రభుత్వానిది బాధ్యత కాదంటూ ఉత్తర్వులు జారీ చేసింది.