సిక్కోలు జవాన్‌ వీర మరణం.. ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌ట‌న‌

సిక్కోలు జవాన్‌ వీర మరణం.. ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌ట‌న‌

విధి నిర్వహణలో సిక్కోలు జవాన్‌ వీర మరణం పొందాడు. ముష్కరులు అమర్చిన బాంబును నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉండగా.. ఆ బాంబు పేలి అసువులు బాశాడు శ్రీకాకుళంలోని హడ్కో కాలనీకి చెందిన లావేటి ఉమామహేశ్వరరావు. 2003లో సైన్యంలో చేరిన ఆయన మరో రెండేళ్లలో పదవీవిరమణ చేయనున్నాడు. ప్రస్తుతం కార్గిల్‌లో విధులు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇక‌, ఇవాళ ఆర్మీ జవాన్  ఉమా మహేశ్వరరావుకు కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్... ఆ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.. ఉమామహేశ్వరరావు భార్య నిరోషాకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామ‌ని.. ఆ కుటుంబానికి 350 గజాల ఇంటి స్థలం, ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం తరపున ఇస్తామని ప్ర‌క‌టించారు.