బ్రేకింగ్ : కరోనాతో ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు కన్నుమూత

బ్రేకింగ్ : కరోనాతో ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు కన్నుమూత

కరోనాతో ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయసు అరవై ఏళ్ళు. టీడీపీ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన మాణిక్యాల రావు, అనంతర పరిణామాల్లో మంత్రి పదవికి రాజీనామా చేసి వైదొలిగారు. ఫోటోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన 2014లో తాడేపల్లి గూడెం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాక బీజేపీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు.

ఆయనకు గత నెల మొదట్లో కరోనా సోకింది. సోకిన సమయంలో ఆయనే వీడియో ఒకటి రిలీజ్ చేసి తెలియచేశారు. అయితే అప్పటి నుండి విజయవాడలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల నుండి ఆయన ఆరోగ్యం బాలేనప్పటికీ నిన్నటి రాత్రి నుండి పరిస్థితి మరింత విషమించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్ నుండి ప్రత్యేక వైద్య బృందం వచ్చి ఆయన ఆరోగ్యం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, ఈరోజు మధ్యాహ్నం కొద్ది సేపటి క్రితం కన్నుమూసినట్టు చెబుతున్నారు.