దుర్గగుడిలో తాంత్రిక పూజలపై పునర్‌విచారణ..!

దుర్గగుడిలో తాంత్రిక పూజలపై పునర్‌విచారణ..!

బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలపై పునర్‌ విచారణ చేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్... ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో పూజలు జరిగాయని, జరగలేదని రెండు నివేదికలు వచ్చాయని.. కానీ, ఆ నివేదికలను ఎవరూ బయటపెట్టలేదు, వాటిని పరిశీలించి విచారణ చేపడతామని స్పష్టం చేశారు. దుర్గగుడి మూల నిధులు కోట్లాది రూపాయలు కరిగించటంపై కూడా విచారణ ఉంటుందన్న వెల్లంపల్లి.. బాధ్యులపై కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు టీటీడీలో అభివృద్ధి దిశగా సంస్కరణలు చేస్తామని వెల్లడించిన కొత్త దేవాదాయశాఖ మంత్రి... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకి తొలి ప్రాధాన్యత ఇస్తామన్న వెల్లంపల్లి.. బెజవాడలో కూల్చిన దేవాలయాల పునరుద్ధరణపై దృష్టి సారిస్తామన్నారు.