ఏపీ లోకల్‌ వార్.. తెరపైకి ఉద్యోగుల కొత్త డిమాండ్..!

ఏపీ లోకల్‌ వార్.. తెరపైకి ఉద్యోగుల కొత్త డిమాండ్..!

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఎస్‌ఈసీ దూకుడుగా ముందుకు వెళ్తుంటే.. అడ్డుకోవడానికి కోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం.. ఇక ఉద్యోగులు కూడా ప్రభుత్వం వెంటే ఉన్నారు.. కనీసం వ్యాక్సినేషన్‌ పూర్తి అయిన తర్వాతే ఎన్నికలు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ గోవా ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని తెర పైకి తెచ్చింది ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య... కాగా, కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతున్నందున్న స్థానిక ఎన్నికలను ఏప్రిల్ వరకు వాయిదా వేసింది గోవా ఎస్‌ఈసీ.. మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించినప్పుడు ఏపీలో వచ్చిన ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.. ఎస్ఈసీకి గోవా ఉదంతమే సమాధానం అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. ఎస్ఈసీ పంతానికి పోతున్నారని మండిపడుతోన్న ఉద్యోగ సంఘాలు. గోవా ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని.. ఏపీ ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు.. నోటిఫికేషన్ ప్రకారం.. ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో మినహాయిస్తే.. ఎక్కడా నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాలేదు. ఇక, సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది... ఓవైపు ప్రభుత్వం.. మరోవైపు ఎన్నికల సంఘం, ఇంకో వైపు ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు ప్రజలు.