రామతీర్థంలో ఏమీ జరగలేదు..! డీజీపీ కామెంట్స్

రామతీర్థంలో ఏమీ జరగలేదు..! డీజీపీ కామెంట్స్

విగ్రహాల ధ్వంసం వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పదంగా మారింది. అయితే, ఈ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్.. రామతీర్థం ప్రధాన ఆలయంలో ఏమీ జరగలేదన్న ఆయన.. గుట్టపై ఉన్న విగ్రహాన్నే ధ్వంసం చేశారన్నారు. సెప్టెంబర్‌లో అంతర్వేది ఘటన తర్వాత ఒక వర్గం అదేపనిగా ఆరోపణలు చేస్తుందన్నారు. తన సర్వీసులోనే ఎప్పుడూ ఇలాంటి మాటలు వినలేదన్నారు. పోలీసులకు కూడా కులాన్ని, మతాన్ని అండగడుతున్నారని విమర్శించారు. ఇక, ఏపీలో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తమని, సత్యదూరమన్నారు డీజీపీ... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పోలీస్‌శాఖ ఆలయాలకు భద్రత కల్పిస్తుందన్న ఆయన.. ఏపీలోని ఆలయాలకు కల్పిస్తున్న భద్రతను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో డీజీపీ సవాంగ్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..