బాబుకు లేఖ రాసిన డీజీపీ.. అలా పంపకండి అంటూ !

బాబుకు లేఖ రాసిన డీజీపీ.. అలా పంపకండి అంటూ !


టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసుల మధ్య లేఖల పర్వం కొనసాగుతోంది.  చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ నిన్న బాబు రాసిన లేఖకు కౌంటర్‌ ఇచ్చారు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. వాస్తవాలు తెలుసుకోకుండా మీడియాకు లేఖలు విడుదల చేయడం సరికాదన్నారాయన. ఇలాంటి చర్యలతో సమాజంలో లేనిపోని అపోహలు, అనుమానాలు తలెత్తుతాయన్న సవాంగ్‌ ఆధారాలు ఉంటే సీల్డ్‌ కవర్‌లో పంపాలని  ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు.

చట్ట ప్రకారం తాము విధులు నిర్వర్తిస్తామని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు మీడియాకు లేఖలు ఇచ్చే ముందు వాస్తవాలను పరిశీలించాలని కోరారు. రామచంద్ర ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రతాప్‌ రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. ప్రతాప్‌రెడ్డికి పండ్ల వ్యాపారికి మధ్య దారి విషయంలో వాగ్వాదం జరుగుతుండగా వెళ్లిన రామ చంద్ర పై ప్రతాప్‌ రెడ్డి దాడి చేశారని డీజీపీ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించామన్న ఆయన వైసీపీ నేతలు పథకం ప్రకారం దాడి చేశారనే ఆరోపణలు అవావస్తమని వివరించారు.