అమ్మోనియం నైట్రేట్ వల్ల ఏపీకి ముప్పు లేదు : ఏపీ డీజీపీ

అమ్మోనియం నైట్రేట్ వల్ల ఏపీకి ముప్పు లేదు : ఏపీ డీజీపీ

బీరట్ లో అమ్మోనియం నైట్రేట్ పేలుడుతో అప్రమత్తమైన ఏపీ పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, వాడకం,  వినియోగంపై  మంగళగిరిలోని సెంట్రల్ ఆఫీస్ నుండి సముద్ర తీర ప్రాంతాల  జిల్లాలయిన శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి అర్బన్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన  ఎస్పీలతో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సంధర్భంగా జిల్లాలలో  అమ్మోనియం నైట్రేట్‌  నిల్వలు, వినియోగం, జాతీయ ,అంతర్జాతీయ రవాణా, ఓడరేవుల వద్ద నిల్వలు, విక్రయాలపైన 2012 లో రూపొందించిన నిబంధనలను జిల్లాల ఎస్పీలకు వివరించారు. అమ్మోనియం నైట్రేట్‌  వినియోగం పై ఖచ్చితంగా నిబంధనలు అమలుచేయాలని, అతిక్రమించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడవద్దని డీజీపీ సూచించారు. 
అమ్మోనియం నైట్రేట్‌ పై 2012  రూపొందించిన నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. 

  • లైసెన్సు లేకుండా తయారీకి అనుమతి లేదు.
  • అనుమతి లేకుండా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తరలించకూడదు.
  • లైసెన్స్ కలిగిన గిడ్డంగులలో మాత్రమే నిల్వ ఉంచాలి.
  • నిబంధనలకు లోబడి ఎగుమతులు/దిగుమతులు నిర్వహించాలి.
  • ఎంపిక చేసిన లైసెన్స్ కలిగిన వారికి మాత్రమే సరఫరా చేయాలి.
  • వేరొక పేలుడు పదార్ధాలతో కలిపి అమ్మోనియం నైట్రేట్ ను రవాణా చేయరాదు.
  • కొనుగోలు చేసిన అమ్మోనియం నైట్రేట్ కు అదనంగా రవాణాకు  అనుమతి లేదు.
  • 18 ఏళ్ల లోపు వారిని, అంగవైకల్యం, అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని ఉద్యోగులగా నియమించకూడదు.
  • అనుమతులేకుండా ఎక్కడ కూడా బ్లాస్టింగ్ లకు ఉపయోగించరాదు.
  • అమ్మోనియం నైట్రేట్ ప్యాకింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి