అసెంబ్లీ చీఫ్ మార్షల్‌కు వార్నింగ్! సభ్యులను టచ్‌ చేయొద్దంటూ రూలింగ్...

అసెంబ్లీ చీఫ్ మార్షల్‌కు వార్నింగ్! సభ్యులను టచ్‌ చేయొద్దంటూ రూలింగ్...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి... మరోవైపు అసెంబ్లీ దగ్గర టీడీపీ సభ్యుల పట్ల మార్షల్స్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దీనిపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ సభ్యులు... దీంతో అసెంబ్లీ చీఫ్ మార్షల్‌కు మండలి చైర్మన్ షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు.. సభ్యులను టచ్ చేయొద్దంటూ రూలింగ్ ఇచ్చారు.. మరోవైపు మరోసారి సభ్యులతో అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రివిలేజ్ దాఖలు చేస్తామని తెలిపారు టీడీపీ సభ్యులు.. ఇక, పద్ధతిగా వ్యవహరించాలంటూ చీఫ్ మార్షల్‌కు స్పష్టం చేశారు మంత్రులు. కాగా, మార్షల్స్ వ్యవహరించిన తీరు వీడియోలను మంత్రులు, మండలి చైర్మన్‌కు చూపించారు టీడీపీ సభ్యులు... ఈ వ్యవహారంపై మీడియా చిట్‌చాట్‌లో లోకేష్ మాట్లాడుతూ... మహిళా మార్షల్స్‌పై అసభ్యంగా ప్రవర్తించారని మాపై ఆరోపణలు చేశారని.. విజువల్స్ చూయించిన తర్వాత మంత్రులు మాట్లాడలేకపోయారని తెలిపారు. ఈ వ్యవహారంపై మండలి చైర్మన్‌ షరీఫ్‌ను ఫ్లోర్ లీడర్లు, మంత్రుల సమక్షంలో కలిశాం.. మూడు రోజులుగా జరుగుతోన్న పరిణామాలపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు లోకేష్.