ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే ?

ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే ?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.  నెల రోజుల క్రితం పదివేల వరకు కేసులు నమోదవుతుండేవి.  కానీ, ఇప్పుడు కేసులు వెయ్యి వరకు నమోదవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 625 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 867063కి చేరింది.  ఇందులో 848511 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 11571 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5 మరణాలు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6981కి చేరింది.