ఏపీ కరోనా అప్డేట్‌..ఇవాళ ఎన్నంటే ?

ఏపీ కరోనా అప్డేట్‌..ఇవాళ ఎన్నంటే ?

ఆంధ్రప్రదేశ్‌ కరోనా పాజిటివ్ కేసులు కొన్ని రోజులుగా 100 కు దిగువగానే వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,268 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 70 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు.  అదే సమయంలో 84 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 886514 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 878771 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7168 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 575 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.