ఏపీ కరోనా అప్డేట్....ఈరోజు ఎన్నంటే ?

ఏపీ కరోనా అప్డేట్....ఈరోజు ఎన్నంటే ?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి.  తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 8,943 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 273085కి చేరింది. ఇందులో 89907 కేసులు యాక్టివ్ గా ఉంటె, 180703 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 97 కరోనా మరణాలు సంభవించాయి.  దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 2475కి చేరింది.  

ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల విషయం తీసుకుంటే, అనంతపూర్ లో 762, చిత్తూరులో 987, తూర్పు గోదావరిలో 1146, గుంటూరులో 527, కడపలో 530, కృష్ణాలో 530, కర్నూలులో 956, నెల్లూరులో 669, ప్రకాశంలో 300, శ్రీకాకుళంలో 547, విశాఖపట్నంలో 885, విజయనగరంలో 548, పశ్చిమ గోదావరిలో 748 కేసులు నమోదయ్యాయి.