ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. కారణమిదే!

ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. కారణమిదే!

ఆంధ్ర ప్రదేశ్  లో కొద్ది రోజులుగా క‌ల్లోలం సృష్టిస్తోన్న క‌రోనా వైర‌స్ కేసులు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే దీనికి కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహించడమే కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 60 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా, నిన్న ఆదివారం కావడంతో 46 వేల పైగా పరీక్షలు మాత్రమే నిర్వహించారు. ఆదివారం అయినందునే కరోనా పరీక్షలు తగ్గించినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌ లో 7,665 కేసులు నమోదయ్యాయి. అలాగే 24 గంటల్లో 80 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 46,999 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 7,665 మందికి పాజిటివ్ అని తేలింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. క‌రోనా బారిన ప‌డిన 138712 మంది కోలుకోగా ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,773 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఈరోజు మృతి చెందిన‌ 80 మందితో కలుపుకుని 2036కు చేరింది. ఇక గ‌త 24 గంట‌ల్లో ప్రకాశం జిల్లాలో పదకొండు, గుంటూరు జిల్లాలో పది, పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు,  చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఆరుగురు, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు, తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు చప్పున మృతి చెందారు.