మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్..! తేడా వస్తే పదవులు ఊడతాయి..!

మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్..! తేడా వస్తే పదవులు ఊడతాయి..!

మంత్రులు, ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఎన్నికలు ఎదుర్కోబోతోంది... త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు  జరగనుండడంతో.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు వైసీపీ అధినేత... ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఆయా మంత్రులకు, ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఇదే, సమయంలో వారికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు సీఎం జగన్. తేడా వస్తే మంత్రి పదవులు ఊడతాయంటూ హెచ్చరించారు.. మంత్రుల సొంత నియోజకవర్గాల్లో ఓటమి పొందితే ఐదు నిమిషాలు కూడా ఆలోచించనని స్పష్టం చేశారట.. దాంతో, ఈ ఎన్నికలను ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అర్థమవుతోంది. 

అంతేకాదు.. పని తీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఉండవని స్పష్టంగా చెప్పేశారు సీఎం వైఎస్ జగన్.. రేపటి నుంచి ఎనిమిదో తేదీ వరకు కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలని సూచించిన ఆయన.. ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే పూర్తి సన్నద్ధతతో ఎన్నికల రంగంలోకి దిగాలని ఆదేశించారు. తిరుగులేని మెజార్టీతో సీఎంగా పగ్గాలు చేపట్టారు వైఎస్  జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు వైసీపీ సర్కార్‌కు ఎలాంటి ఎన్నికలకు ఎదురుకాలేదు... ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో... రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎలాంటి ఫలితాల వైపు మొగ్గు చూపుతాయేననే టెన్షన్ ఉంది. దాంతో... ఈ ఎన్నికల్లో సత్తా చాటి... తమ నిర్ణయాలకు ప్రజామోదం కూడా ఉందని చాటాలని భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.