మంత్రులకు సీఎం జగన్ స్వీట్ వార్నింగ్..!

మంత్రులకు సీఎం జగన్ స్వీట్ వార్నింగ్..!

ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత తక్కువ కాలంలోనే పాలనపై తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను వడివడిగా అడుగులు వేస్తూనే.. మంత్రులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇక బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట సీఎం జగన్.. నాలుగున్నర నెలల కాలంలో మంత్రుల పని తీరుకు కితాబిస్తూనే సున్నితంగా హెచ్చరించారు. నాలుగున్నర నెలల కాలంలో ఎక్కడా ఎలాంటి ఆరోపణలు రాకుండా మంత్రులు పని చేశారన్న జగన్. ఒకటి ఆరా ఆరోపణలున్నా.. ఆ విషయాలు సదురు మంత్రులతోనే వ్యక్తిగతంగా మాట్లాడతానని చెప్పారట. మంచి ఉద్దేశ్యంతో కేబినెట్‌లోకి తీసుకున్నామని.. మచ్చ లేకుండా ఇప్పటి వరకు పని చేసినట్టే భవిష్యత్తులోనూ పని చేయాలని సూచించారు జగన్. 

ఇర. చంద్రబాబే కాకుండా తప్పులు చేస్తే టార్గెట్ చేయడానికి చాలా మంది ఉన్నారంటూ మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్... తప్పు జరిగితే పదవి నుంచి తప్పించేంత వరకు వెంటపడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న ఆయన.. ఏరికోరి కేబినెట్‌లో చేర్చుకున్నవారిని తప్పించే పరిస్థితి వస్తే తనకూ బాధ కలుగుతుందని సీఎం జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది.