మహిళలకు జగనన్న చేయూత..నేడు ఒక్కో అకౌంట్‌ లో 18,750 జమ !

మహిళలకు జగనన్న చేయూత..నేడు ఒక్కో అకౌంట్‌ లో 18,750 జమ !

రాష్ట్రంలో ఎన్నికల ముందు మహిళల సాధికారతే లక్ష్యంగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆదిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళల సంక్షేమం కోసం "జగనన్న చేయూత " పథకాన్ని ఈ రోజు ప్రారంభించేందుకు సర్వం సిద్దమైంది. ఈ పథకంలో భాగంగా 20 లక్షల మంది మహిళల కోసం ఈ సంవత్సరం 4700 కోట్లు కేటాయించినట్లు బీసీ సంక్షేమ మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. పథకం ద్వారా 24లక్షల నుండి 25 లక్షల మంది మహిళలు లబ్ది పొందనున్నట్టు చెబుతున్నారు.