జగన్‌ గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌లో రూ.4 వేలు, సంక్రాంతికి మరో 2 వేలు..!

జగన్‌ గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌లో రూ.4 వేలు, సంక్రాంతికి మరో 2 వేలు..!

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ ఏడాది రైతులకు ఉచితంగా పంటల బీమాను అందిస్తామని ప్రకటించిన ఆయన.. ప్రమాదవశాత్తు రైతులు మృతి చెందితే  ఆ కుటుంబానికి రూ. 7 లక్షలు చెల్లిస్తున్నామని.. ఇప్పటికే 229 రైతు కుటుంబాలకు ఈ పరిహారం అందిందని వెల్లడించారు.. రైతులు, కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. మన పాలన- మీ సూచన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాలపై మేథోమథనం నిర్వహించారు. ఈ ఏడాది మే నెలలో రైతులకు పెట్టుబడి కింద రూ. 7,500 ఇచ్చామని.. అక్టోబర్ మాసంలో మరో రూ. 4 వేలు చెల్లిస్తామన్నారు.. తన సుదీర్ఘ పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా చూసానని గుర్తుచేసుకున్న వైఎస్ జగన్.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రైతుల కోసం రూ.10,290 కోట్లను ఖర్చు చేశామన్నారు. నాలుగేళ్లకు బదులుగా ఐదేళ్లకు రైతులకు భరోసా ఇచ్చేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.

మరోవైపు.. సాగు ఖర్చు విపరీతంగా పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం జగన్.. పంట సాగు ఖర్చు తగ్గించగలిగితే రైతులు బాగుపడతారన్నారు.. పంటకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని.. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ ను అందిస్తున్నామని గుర్తుచేశారు. ఓవైపు కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులున్నా.. రైతులకు రూ. 1300 కోట్లు సహాయం చేసినట్టుగా సీఎం వివరించారు. రూ.1100 కోట్లతో పంటలను కొనుగోలు చేసినట్టుగా తెలిపిన సీఎం జగన్.. ఆక్వా రైతుకు యూనిట్ విద్యుత్ ను రూపాయికే ఇస్తున్నామని.. మార్కెట్ యార్డు చైర్మెన్ పదవుల్లో సామాజిక న్యాయం తెచ్చేందుకు ప్రయత్నించామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చైర్మెన్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని వెల్లడించారు.. ఇక ఈ పదవుల్లో 50 శాతం మహిళలే ఉండేలా చట్టం తెచ్చామన్నారు సీఎం. ఈ నెల 30న, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించిన సీఎం జగన్.. రాష్ట్రంలో 10641  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సహాయం చేస్తామన్నారు.. రైతు భరోసా కింద ఈ నెలలో రూ.7500 ఇచ్చామని, అక్టోబర్‌లో మరో రూ.4000 ఇస్తామని,, సంక్రాంతి సమయంలో మరో రూ.2 వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి.