అభయ యాప్‌ను ప్రారంభించిన సీఎం జగన్

అభయ యాప్‌ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం జగన్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయ్‌ ప్రాజెక్టును సీఎం వైస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. రవాణా శాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్టును సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్ట్‌ ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత పథకాలు ప్రవేశ పెట్టామని తెలిపారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళ పేరుపైనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామన్నారు సీఎం జగన్‌. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించామని తెలిపారు. హోం మంత్రి, డిప్యూటీ సీఎం పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించినట్టు స్పష్టం చేశారు. మహిలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదని పేర్కొన్నారు సీఎం జగన్‌.