ఏపీలో జగనన్న తోడు పథకం ప్రారంభం...అర్హతలు ఇవే...
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మరోకొత్త పథకాన్ని ప్రారంభించారు. చిరు వ్యాపారులను ఆదుకోవడానికి తోడు అనే పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఈ స్కీమ్ ను ప్రారంభించారు. చిరు వ్యాపారులకు బ్యాంకు నుంచి రూ.10వేల రుణాన్ని అందించనున్నారు. మొదటగా 10 లక్షల మంది వ్యాపారులకు బ్యాంకుల నుంచి రుణం అందిస్తున్నారు. ఇక బ్యాంకు అకౌంట్లు లేనివారికి అకౌంట్లు కల్పించబోతున్నారు. ఐదడుగుల, అంతకంటే తక్కువ స్థలంలో ఉన్న షాపులకు, ఫుట్ పాత్ లపైన, తోపుడు బండ్లపైన, గంపల్లో వివిధ వస్తువులను పెట్టుకొని ఊరూరా తిరిగి అమ్ముకునే వ్యాపారాలు ఈ తోడు స్కీమ్ కి అర్హులని సీఎం జగన్ తెలిపారు. గ్రామాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో నెలకు రూ.12వేలు ఆదాయం ఉన్నవారు ఈ తోడు స్కీమ్ కి అర్హులని సీఎం తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని సీఎం పేర్కొన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)