సీఎం వైఎస్ జగన్ కీలక భేటీ... వాటిపైనే ఫోకస్..!

సీఎం వైఎస్ జగన్ కీలక భేటీ... వాటిపైనే ఫోకస్..!

బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలు, బిల్లులపై తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్‌గా దృష్టిపెట్టారు. ఈ అంశాలపై ఎడతెరపని చర్చలు జరుపుతున్నారు. కాసేపటి క్రితం సీనియర్ న్యాయవాది, మాజీ అటర్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో చర్చించిన సీఎం జగన్... తర్వాత మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. బిల్లును ఆమోదింపజేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వెల్లంపల్లి, కన్నబాబు, సీనియర్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు ప్రసాద్ రావు, ఉమ్మారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 

క్యాంప్ కార్యాలయంలో ఇదే విషయంపై ఉదయం దాదాపు గంటపై చర్చలు జరిపిన సీఎం జగన్... అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ప్రధానంగా మండలిలో బిల్లు ఆమోదం పొందకపోవడం, సెలక్ట్ కమిటీకి మండలి ఛైర్మన్ సిఫారసు చేయడంపై చర్చ సాగుతోంది. రూల్స్‌కు విరుద్ధంగా చైర్మన్ విచక్షణాధికార నిర్ణయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిని ఎలా అదిగమించాలి, అనే దానిపై చర్చ సాగుతుండగా.. మరోవైపు బిల్లులను పాస్ చేసేందుకు ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో శాసనమండలిలో రద్దుచేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.