దీదీతో చంద్రబాబు కీలక చర్చలు..

దీదీతో చంద్రబాబు కీలక చర్చలు..

బీజేపీయేతర పార్టీల నేతలను ఒక్కటి చేసేపనిలో ఉన్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కాసేపట్లో కోల్‌కతా వెళ్లనున్నారు. ఇప్పటికే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ గాంధీతో చర్చలు జరిపిన చంద్రబాబు... ఆ భేటీకి సంబంధించిన విషయాలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పంచుకోనున్నారు. మే 23వ తేదీకి ముందే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకం చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ మమతాను కలవనున్న చంద్రబాబు. కోల్‌కతాలోని సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం మమతా బెనర్జీతో సమావేశం కానున్న ఏపీ సీఎం... కూటమి యొక్క వ్యూహాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం కోల్‌కతా నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు... ఢిల్లీలో ఎన్డీఏయేతర పార్టీ నేతలను కలవనున్నారు.