మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ..వీటిపైనే చర్చ

మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ..వీటిపైనే చర్చ

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా  వైఎస్సార్ రైతు భరోసా పథకానికి ఆమోదం తెలుపనున్న కేబినెట్..రైతు భరోసా కోసం 3 వేల 30 కోట్లకు ఆమోదం తెలుపనుంది. అలాగే  వైఎస్సార్ ఉచిత భీమా పథకానికి ఆమోదం తెలుపనున్న కేబినెట్.. 2,589 కోట్లతో వైఎస్సార్ ఉచిత భీమా పథకం అమలు చేయనుంది.  వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి ఆమోదం తెలపనున్న కేబినెట్.. మత్స్యకారులకు 10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది జగన్ ప్రభుత్వం. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు యూనివర్సిటీల చట్టం-2016కు సవరణలకు ఆమోదం తెలుపనున్న కేబినెట్..కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి 66 కోట్ల రూపాయల కేటాయింపు చేయనుంది. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేబినెట్ అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం పాల ఉత్పత్తిదారుల కంపెనీకి ఏపీడీడీసీఎఫ్ ద్వారా 69 కోట్ల రుణం ఇచ్చే అంశాన్ని ర్యాటిఫై చేయనుంది కేబినెట్.