కెబినెట్ భేటీ : రాజధాని పరిధిలో అసంపూర్ణ నిర్మాణాలపై చర్చ

కెబినెట్ భేటీ : రాజధాని పరిధిలో అసంపూర్ణ నిర్మాణాలపై చర్చ

కాసేపట్లో ఏపీ కెబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్ణ నిర్మాణాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. అసంపూర్తి భవనాల నిర్మాణానికి ఎమ్మార్డీఏ కు రూ. 3 వేల కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వనుంది కెబినెట్. వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు ఆమోదం తెలపనుంది మంత్రి వర్గం. వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థగా... లిబర్టీ స్టీల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఉందనువుంది.

వచ్చే ఆర్ధిక సంవత్సరానికి నవరత్న పథకాల నిధుల కేటాయింపునకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 1.43 లక్షల మంది లబ్దిదారులకు ఏపీ టిడ్కో కింద ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి 300 చదరపు అడుగుల కేటాయింపునకు ఆమోదం తెలపనుంది కెబినెట్. కాకినాడ గేట్వే పోర్టులో భాగస్వామ్య వాటాల బదలాయింపు పై చర్చించనున్నారు. 2021-22లో ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం తెలిపి... వచ్చే మూడేళ్లల్లో ఒక్కో మహిళ లబ్దిదారుకు రూ. 45 వేల కేటాయింపు పై చర్చించనున్నారు.