ముగిసిన ఏపీ కేబినెట్..

ముగిసిన ఏపీ కేబినెట్..

ఇవాళ ఏపీ కేబినెట్‌ భేటీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన విషయం తెలిసిందే. కాసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది. అయితే.. ఈ కేబినెట్‌లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు... ఎంపిటిసి, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికలపై చర్చ జరిగింది.  అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రులకు సీఎం జగన్ తెలిపారు. ముందు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహణ చేపట్టాలని కోరతామని వ్యాఖ్యానించిన సీఎం... కోవిడ్ వాక్సినేషన్ త్వరగా ఇవ్వకపోతే  మళ్ళీ కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.  పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలపై సీఎం జగన్‌ను అభినందించారు మంత్రులు.  పంచాయతీల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 80 శాతం ఫలితాలు సాధించమన్నారు సీఎం జగన్.  అలాగే.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై కేబినెట్ లో చర్చ జరిగింది.  దీనిపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్‌.