ముగిసిన ఏపీ కేబినెట్‌.. కీల‌క నిర్ణ‌యానికి ఆమోదం

ముగిసిన ఏపీ కేబినెట్‌.. కీల‌క నిర్ణ‌యానికి ఆమోదం

సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ స‌మావేశం ముగిసింది.. ఇప్ప‌టికే రాష్ట్రవ్యాప్తంగా నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉండ‌గా.. కోవిడ్ కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి.. డే టైంలోనూ క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకోగా.. రేపటి నుంచి త‌ల‌పెట్టిన డే కర్ఫ్యూ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.. దీంతో.. ఉదయం 6 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు మాత్ర‌మే వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజా రవాణాకు అనుమతి ఉండ‌నుంది.. మధ్యాహ్నం 12 గంట‌ల‌ తర్వాత పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమ‌లు చేయ‌నున్నారు.. మధ్యాహ్నం12 తర్వాత ప్రజారవాణా వాహనాలు కూడా పూర్తిగా నిలిపివేయాలని స‌ర్కార్ నిర్ణ‌యించింది.. దీంతో.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ స‌ర్వీసులు, అంతర్రాష్ట్ర, దూరప్రాంత సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి..