మోడీ సభను ప్రజలే సక్సెస్ చేయాలి

మోడీ సభను ప్రజలే సక్సెస్ చేయాలి

మార్చ్ 1 న విశాఖ లో జరిగే ప్రజా చైతన్య సభను విజయవంతం చేసే బాధ్యత ప్రజలపైనే ఉందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే జోన్ పై మంచి నిర్ణయం ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ ను మించిన మహా నటుడు చంద్రబాబు అని, ఆయన అంత డ్రామా ఆర్టిస్టు ను మరెక్కడా చూడలేదని కన్నా అన్నారు. పోలవరానికి కేంద్ర నిధులు తీసుకుని విహార యాత్రల కోసం రూ. 600 కోట్లు ఖర్చు చేసారని  ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఆరోపించారు. ఈ విషయంలో సోషల్ ఆడిట్ కు వెళ్లే దమ్ము టీడీపీ నేతలకు ఉందా అని కన్నా లక్ష్మినారాయణ సవాల్ విసిరారు.