రేపటినుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం...

రేపటినుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం...

రేపటినుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ.. పది గంటలకు శాసన మండలి భేటీ జరగనుంది. తొలి రోజునే ఉభయ సభల ఆమోదానికి రానున్నాయి వివిధ శాఖలకు చెందిన ఆర్డినెన్సులు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు మాజీ ప్రజాప్రతినిధుల మృతికి సంతాపం తెలపనున్నాయి ఉభయ సభలు. బీఏసీ సమావేశంలో పని దినాలను ఖరారు చేయనున్నారు అసెంబ్లీ స్పీకర్. ప్రశ్నోత్తరాలు లేకుండానే ఉభయ సభలను నడపాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రశ్నోత్తరాలు ఉండి తీరాల్సిందే అని ప్రతిపక్షం అంటుంది. రేపు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సభకు రానున్నారు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం మీడియా పాయింట్ ఏర్పాటుకు అనుమతిని నిరాకరించారు.