నవంబర్ 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... 

నవంబర్ 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... 

కరోనా వ్యాప్తి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించింది.  అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో శాసనమండలిలో అనేక బిల్లులు పెండింగులో ఉండిపోయాయి.  ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లు పెండింగ్ లోనే ఉండిపోయింది.  దీంతో పాటుగా కీలక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.  ప్రస్తుతం ఏపీలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా ఉధృతి కొంతమేర కంట్రోల్ కావడంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  దీనిపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఏపీ గవర్నర్ రిలీజ్ చేశారు.  ఈనెల 30 వ తేదీ నుంచి ఐదురోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నది.  ఈనెల 30 వ తేదీన బిఏసి సమావేశంలో అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలి.  ఏఏ బిల్లులు ప్రవేశపెట్టాలి. వేటి గురించి చర్చించాలి అనే అంశంపై చర్చించే అవకాశం ఉంటుంది.