ఏపీ అసెంబ్లీ సమావేశాలు: రెండో రోజూ అదే రగడ... టిడిపి నేత సస్పెండ్ 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు: రెండో రోజూ అదే రగడ... టిడిపి నేత సస్పెండ్ 

ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో అదే విధమైన రగడ జరుగుతున్నది.  మొదటిరోజు నివర్ తుఫాన్ నష్టంపై చర్చకు టీడీపీ పట్టుపట్టింది.  సభలో చంద్రబాబు నాయుడు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి కింద కూర్చొని నిరసనలు తెలిపారు.  దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలను ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.  రెండు రోజు కూడా అదే విధమైన రగడ జరుగుతున్నది.  టిడ్కొ ఇళ్ల పంపిణిపై టీడీపీ ప్రశ్నించింది.  టిడ్కొ ఇళ్ల పంపిణిపై చర్చించాలని కోరింది.  దీనిపై ప్రభుత్వం అభ్యంతరం జరిగింది. దీంతో టీడీపీ నేతలు సభలో నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు.  స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసనలు తెలిపారు.  దీంతో టీడీపీ సభ్యులైన నిమ్మల రామానాయుడిని ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.  

టీడీపీ సభ్యులు సభలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, పధకం ప్రకారం సభను జరగకుండా చేస్తున్నారని వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.  డిసెంబర్ 15 వరకు రైతుల అకౌంట్ లో డబ్బులు జమచేస్తామని, బటన్ నొక్కితే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని, చర్చ జరపకుండానే పోడియం వద్దకు వెళ్లి నిరసనలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు.