చేతులకు సంకెళ్లతో అసెంబ్లీకి టిడిపి నేతలు...
ఏపీ అసెంబ్లీ శీతాకాల 4వ రోజు సమావేశాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. గత మూడు రోజులుగా సభలో టిడిపి, వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈరోజు, రేపు మాత్రమే సభ జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు టిడిపి నేతలు చేతులకు సంకెట్లతో అసెంబ్లీకి వచ్చారు. టిడిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ సంకెళ్లతో అసెంబ్లీకి వచ్చారు. వివిధ వర్గాలపై దాడులు జరుగుతున్నాయని, దానికి నిరసనగా సంకెళ్లతో అసెంబ్లీకి వచ్చినట్టు నేతలు చెప్తున్నారు. ఏడాదిన్నర కాలంగా ఎస్సీ, ఎస్టి, బీసీ, ముస్లిం మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, నమ్మి ఓట్లు వేయడమే వారు చేసిన తప్పా అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈరోజు సభలో ఎస్సి, ఎస్టీ, బిసి, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన బిల్లులపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)