ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఉపాధి హామీ నిధులపై టిడిపి నిరసన 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఉపాధి హామీ నిధులపై టిడిపి నిరసన 

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి.  అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు చివరి రోజు కావడంతో వీలైనన్ని బిల్లులను ఆమోదించుకోవాలని చూస్తున్నారు. పెండింగ్ లో ఉన్న ఉపాధిహామీ నిధులను వెంటనే చెల్లించాలని చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనను తెలియజేశారు.  పెండింగ్ లో ఉన్న రూ.2500 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.  జగన్ సీఎం అయ్యాక అభివృద్ధి కుంటుపడిందని, సంక్షేమం పేరుతో మభ్యపెడుతున్నారు.  నేరుగా నిధుల్ని సద్వినియోగం చేసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ హయాంలో చేపట్టారని, ప్రభుత్వం మారిన తరువాత నరేగా నిధులను నిలుపుదల చేసిందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.  గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.