ముగిసిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ.. వారికి నోటీసులు..!

ముగిసిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ.. వారికి నోటీసులు..!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది.. కేవలం ప్రాథమికంగా సమావేశమైన కమిటీ... టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు వారం రోజుల్లో నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది... నిబంధనల ప్రకారం.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు నివ్వాలనే నిర్ణయానికి వచ్చింది ప్రివిలేజ్ కమిటీ.. స్పీకర్ రిఫర్ చేసిన కారణంగా.. అచ్చెన్నాయుడుకు, చీఫ్ విప్ సభలో తీర్మానం చేసిన ప్రకారం రామానాయుడుకు నోటీసులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.. 2019లో టీడీపీ ఇచ్చిన సభ హక్కుల నోటీసులు.. అయితే, సరైన ఫార్మాట్ లేని కారణంగా సరైన చర్చ జరగనట్టు తెలుస్తోంది... కాగా, వచ్చే నెలలో తిరుపతిలో మరోసారి ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.