నేటితో ముగియనున్న వర్షాకాల సమావేశాలు...

నేటితో ముగియనున్న వర్షాకాల సమావేశాలు...

నేటితో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి... ఏడు రోజుల పాటు అసెంబ్లీ ఉభయసభలు సాగగా... నేడు అసెంబ్లీలో 14 బిల్లులను  ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. చివరిరోజు వృద్ధాప్య పింఛన్లపై అత్యవసర ప్రజాప్రయోజన నోటీసు, చర్చ... నదుల అనుసంధానంపై లఘు చర్చ, సంక్షేమ రంగంపై లఘు చర్చ, వైద్యారోగ్యంపై లఘు చర్చ, 344 నిబంధన కింద గ్రామదర్శిని 1500 పనిదినాలు అమలుపై చర్చ జరగనుండగా... చంద్రన్న బీమా, ముఖ్యమంత్రి యువసేన పథకాలపై 344 నిబంధన కింద చర్చించనున్నారు. కృష్ణానది కరకట్టల నిర్మాణం, శ్రీకాకుళం రిమ్స్‌ వైద్యశాలలో పోస్టుల భర్తీ, సూళ్లూరుపేటలో ఫెర్రీ కాల్వ దురాక్రమణ, కొండ రాజులను గిరిజన తెగగా గుర్తించడం, ప్రత్తిపాడు నియోజకవర్గంలో వ్యవసాయ భూములకు నీరు, రాష్ట్రంలో మితంవ్యయ గృహాల నిర్మాణం, ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవ అమలుపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చర్చసాగనుంది.