ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు?

ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు?

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. త్వరలో 20వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 9 వేల టీచర్ల పోస్టులతో పాటు ఇతరత్రా ఖాళీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్‌ ఏర్పాటును కూడా ఆమోదించారు. ఉడాకు మెడ్‌టెక్‌ జోన్ చెల్లించాల్సిన రూ.11 కోట్ల పన్నుకు మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పేరును వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీగా మార్పు చేశారు. వీఎమ్‌ఆర్‌డీ పరిధి 5573 చ.కి.మీ. నుంచి 6764.59 చ.కి.మీ వరకు పెంచారు. ఫిజియోథెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగల్న్ ఇచ్చారు. మంత్రి పితాని సూచన మేరకు ఆక్వా ప్రాజెక్ట్ సమస్యను పరిశీలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.