డిసెంబరు రెండో వారంలో ఏపీ అసెంబ్లీ?

డిసెంబరు రెండో వారంలో ఏపీ అసెంబ్లీ?

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు రెండో వారంలో జరగనున్నట్లు తెలుస్తుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత లేదు.  రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలన్నది ఒక ప్రతిపాదన. వచ్చే సమావేశాల్లోనే శాసన మండలి ఛైర్మన్‌ను కూడా ఎన్నుకోనున్నారు. డిసెంబర్ 10న ఢిల్లీలో నిర్వహించనున్న బీజేపీయేతర పార్టీ సమావేశానికి చంద్రబాబు హజరుకానున్నారు. ఆ తరువాతే శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.