అనుష్క'నిశబ్దం' కు పోటీగా కుర్రహీరో సినిమా

అనుష్క'నిశబ్దం' కు పోటీగా కుర్రహీరో సినిమా

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా నిశ్శబ్దం. ఈసినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించగా మాధవన్‌, అంజలి, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సింది. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అవుతుంది. 'నిశబ్దం' మరియు యువ హీరో రాజ్ తరుణ్ నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాలు ఒకే రోజున వేరు వేరు ఓటీటీలలో రిలీజ్ కానున్నాయి. అక్టోబర్ 2న తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' లో 'ఒరేయ్ బుజ్జిగా' విడుదల కానుంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక అయ్యర్ - హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. డిజిటల్ స్ట్రీమింగ్ వార్ లో అమెజాన్ లో 'నిశబ్దం' మరియు ఆహాలో 'ఒరేయ్ బుజ్జిగా' పోటీ పడనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రెండిటిలో  ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.