శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి: అనుష్క

శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి: అనుష్క

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ జాగ్రత్తలు వహించాలంటూ కోరుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని తెలియజేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమకు తాముగా స్వీయ నిర్బంధం విధించుకోవాలని కోరింది. ప్రతిఒక్కరికీ వారి బాధలను ఎలా వ్యక్తపరచాలో తెలియకపోవచ్చు. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఇలాంటి సమయంలో మనకు పాజిటివ్‌ ఎనర్జీ అవసరం.. దానికోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి అంటూ స్వీటీ కోరింది.