బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుష్క..!

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుష్క..!

బిగ్‌బాస్ షోకు ఎంత క్రేజ్‌ ఉందో అందరికి తెలుసు. ఈ షోకు విపరీతంగా ప్రేక్షకులు పెరుగుతున్నారు.  ఇప్పటికే ఈ షో మంచి రసవత్తరంగా మారింది. ఈ తరుణంలో  ప్రేక్షకులకు బిగ్‌బాస్ ఓ శుభవార్త చెప్పింది. ఈ షోలో స్వీటీ అనుష్క సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఇవాళ్టి ఎపిసోడ్‌లోనే అని సమాచారం అందుతోంది. అయితే అనుష్క నటించిన నిశ్వబ్దం అక్టోబర్‌ 2న ఓటీటీలో విడుదల కాబోతుంది. కరోనా కారణంగా ఈ సినిమా ప్రమోషన్లు కూడా ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్నారు. దీంతో ఈ సినిమా అందరికీ చేరడం లేదు.  ఈ క్రమంలో ఇప్పుడు బుల్లితెరపై  బిగ్‌బాస్ కొనసాగుతుండటంతో నిశ్శబ్దం టీం అందులోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనుష్క టీమ్‌ హౌజ్‌లోకి వెళ్లి కంటెస్టెంట్‌లతో సందడి చేయనున్నట్లు సమాచారం. అయితే...అనుష్క టీమ్‌ నిజంగానే  బిగ్‌బాస్ షోకు వెళుతుందా..? లేదా? అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.