తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ...

తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ...

భారత క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లీ ఎన్నో విజయాలను అందించాడు. కోహ్లీ పూర్తి స్థాయి కెప్టెన్ బాధ్యతలు అప్పగించాక..  టీం ఇండియాను  తిరుగులేని శక్తిగా నిలిపాడు.  అయితే కోహ్లీ  కొద్ది సేప‌టి క్రితం తన అభిమానుల‌కి గుడ్ న్యూస్ చెప్పాడు. తాను త్వరలో తండ్రి కాబోతున్నానని కోహ్లీ తన ట్విట్టర్ లో తెలిపాడు.   "ఇప్పుడు మేం ముగ్గురు కాబోతున్నాం. 2021లో పండంటి బిడ్డ మా ఇంట్లో అడుగుపెట్ట‌బోతున్నాడు" అని ట్విట్ట‌ర్ ద్వారా కోహ్లీ తెలిపాడు. ఈ విష‌యం ప్ర‌క‌టించిన వెంట‌నే అభిమానులు, సెల‌బ్రిటీలు ఈ దంప‌తుల‌కి శుభాకాంక్ష‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా..  ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్ళాడు.