టీమిండియా బస్సులో 'అనుష్క'

టీమిండియా బస్సులో 'అనుష్క'

ఐర్లాండ్ జట్టుపై టీ-20 సిరీస్ గెలిచిన టీమిండియా.. ఇంగ్లండ్‌తో మూడు టీ-20లలో భాగంగా జరిగిన మొదటి టీ-20లో ఘన విజయం సాధించి రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రెండో టీ-20 కోసం టీమిండియా కార్డిఫ్‌ చేరుకుంది. కార్డిఫ్‌ చేరుకునే సమయంలో జట్టు మొత్తం ఓ బస్సులో ఇంగ్లండ్‌లోని హోటల్‌కు  చేరుకున్నారు. అదే బస్సులో భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ కూడా కనిపించింది. బస్సులోంచి మొదట అనుష్కశర్మ దిగగా.. తరువాత కోహ్లీ దిగాడు. కొన్ని రోజుల ముందు కోహ్లీ ఇంగ్లండ్‌ పర్యటనకు బయలుదేరే ముందు అనుష్క ముంబయి ఎయిర్‌పోర్టుకి వచ్చి విరాట్ కు వీడ్కోలు పలికింది. ఇప్పుడు అనుష్క ఒక్కసారిగా కోహ్లీతో కలిసి బస్సులో ప్రత్యక్షమయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. కార్డిఫ్‌లోని సోఫియా  మైదానంలో రేపు రాత్రి 10 గంటలకు రెండవ టీ-20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది.