ప్రిన్స్‌ మహేష్‌తో మరోసారి రొమాన్స్ కు జేజమ్మ రెడీ..!

ప్రిన్స్‌ మహేష్‌తో మరోసారి రొమాన్స్ కు జేజమ్మ రెడీ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారిపాట' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమానుంచి టైటిల్ పోస్టర్ ,  మోషన్ పోస్టర్ ను  విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్స్ చూస్తుంటే మహేష్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నాడని అర్ధమవుతుంది. మొదటి నుంచి ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలు ఆధారంగా ఉండనుందని ప్రచారం జరుగుతుంది. ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే పరశురామ్ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నా కరోనా ఎంట్రీ ఇవ్వడంతో అది కుదరలేదు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. సర్కారు వారి పాటలో జేజెమ్మ అనుష్క నటించబోతుందట. ఇందులో నిజమెంత ఉందో తెలీదు కానీ... సమాచారం మేరకు సర్కారు వారి పాటలో అనుష్క శెట్టి ఓ బ్యాంక్‌ ఆఫీసర్‌ రోల్‌లో కనిపించనుందట. ఇంతకు ముందు మహేశ్‌, అనుష్క జోడీగా "ఖలేజా' మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అంతగా ఆడలేదు. తర్వాత వీరి జోడీ తెరపై మెప్పించనేలేదు. మరీ ఈ సినిమాలో అనుష్క నటిస్తుందా? లేదా? అనేది మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.