పాయల్  ఆరోపణలు నిరాధారమైనవి : అనురాగ్

పాయల్  ఆరోపణలు నిరాధారమైనవి : అనురాగ్

సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే నెపోటిజం , డ్రగ్స్  బాలీవుడ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే క్యాస్టింగ్ కౌచ్ కూడా వార్తల్లోకి వస్తుంది. తాజాగా నటి పాయల్ గోష్ మీడియా ముందుకు వచ్చి ఓ దర్శకుడు తనను రూమ్ కు తీసుకెళ్లి బలవంతం చేయబోయాడని చెప్పింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనకు అవకాశాలు ఇప్పిస్తానని రూమ్ కి తీసుకెళ్లి తన పై అత్యాచారం చేయబోయాడని  ఆరోపించింది పాయల్ . కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. అతడిని వదలొద్దు.  నేను ఇలా బయటపడటంతో నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి" అంటూ ప్రధాని నరేంద్ర మోడీని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వేడుకుంది పాయల్. ఇదిలా ఉంటే ఈ వివాదం పై అనురాగ్ కశ్యప్ స్పందించాడు. తాను దర్శకుడిని కావడంతో ఎంతో మంది మహిళలతో కలిసి పని చేయాల్సి వుంటుందిని , తనకు మహిళలంటే గౌరవమని అన్నారు. నా నోరు మూయించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని . పాయల్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి .. వాటిని నేను పట్టించుకోను అని అనురాగ్ అంటూ కామెంట్స్ చేశాడు. ఒక మహిళ, మరో మహిళతో ఇదంతా చేయిస్తున్నట్టు అనిపిస్తుందని అనురాగ్ అన్నాడు. బాలీవుడ్ నటి కంగనా కు అనురాగ్ కు పెద్ద యుద్దమే జరుగుతుందన్న విషయం తెలిసిందే.