నిఖిల్ తో అనుపమ.. ?

నిఖిల్ తో అనుపమ.. ?

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 18 పేజీస్‌. కుమారి 21 ఎఫ్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . అయితే ఈ సినిమాలో నిఖిల్ కు జంటగా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ కు మెమరీ లాస్ సమస్య ఉంటుంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. హ్యాపీ డేస్ సినిమాతో  అడుగుపెట్టి తనదైన నటన తో వరుసగా సినిమాలు చేస్తన్నాడు నిఖిల్ . హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఈ యాంగ్ హీరో. ఇప్పటికే ఈ సినిమా తర్వాత ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్‌) బ్యానర్‌ లో మరో సినిమా అనౌన్స్ చేసాడు.