‘కార్తికేయ-2’ హీరోయిన్‌గా అనుపమ!

‘కార్తికేయ-2’ హీరోయిన్‌గా అనుపమ!

2014లో వచ్చిన ‘కార్తికేయ’ సీక్వెల్‌గా ‘కార్తికేయ’ 2 చిత్రం తెరకెక్కనుంది. నిఖిల్‌ హీరోగా చందు మొండేటి ‘కార్తికేయ 2’ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా అమధ్యే పూర్తయ్యాయి. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తి అవ్వగా.. ఈ నెల 26 నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కాబోతోంది. ఇక ఇందులో ఓ హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అనుపమ, నిఖిల్ సరసన ‘18 పేజెస్’ లో నటిస్తోంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.