తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు...
కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఇండియాలోని రాష్ట్రాలు లాక్ డౌన్ చేశాయి. ప్రజలు బయటకు రాకుండా ఉండాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలు కూడా అర్ధం చేసుకొని చాలా వరకు బటయకు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు తెలంగాణలో 33 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం, తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లండన్ నుంచి వచ్చిన కూకట్ పల్లి వచ్చిన వ్యక్తికీ, జర్మనీ నుంచి చందానగర్ కు వచ్చిన వచ్చిన మహిళకు, బేగంపేటకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)